అన్న క్యాంటీన్‌కు విరాళం

అన్న క్యాంటీన్‌కు విరాళం

SKLM: ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌కు రాష్ట్ర కలింగ వైశ్యకార్పొరేటర్ డైరెక్టర్ జామి వెంకట్రావు స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తికి లక్ష రూపాయలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని సేవా కార్యక్రమ రూపంలో వెంకట్రావు ఈ లక్ష రూపాయలు అందించడం అభినందదాయకమని అన్నారు.