కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్న విద్యార్థులు
కిడ్నాపర్ల చెరలో ఉన్న 50 మంది నైజీరియా విద్యారులు వారి నుంచి తెలివిగా తప్పించుకున్నారు. వారంతా సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేరారు. ఇంకా 253 మంది విద్యార్థులు, 12 మంది టీచర్లు నిర్బంధంలోనే ఉన్నారని అధికారులు తెలిపారు. సాయుధులైన కొంతమంది దుండగులు కేథలిక్ పాఠశాలపై దాడి చేసి 303 మందిని కిడ్నాప్ చేశారు. మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.