విద్యార్థులపై దాడి చేసిన ఉపాధ్యాయుడికి మెమో

విద్యార్థులపై దాడి చేసిన ఉపాధ్యాయుడికి మెమో

WGL: పర్వతగిరి మండలం కొంకపాకలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐదుగురు విద్యార్థులను కొట్టిన ఉపాధ్యాయుడు వెంకట్రాం నరసయ్యకు ఆదివారం ఎంఈవో బిక్షపతి మెమో జారీ చేశారు. ఘటనలో ఒక విద్యార్థికి రెండు వేళ్లు విరగగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని డీఈఓ దృష్టికి తీసుకెళ్లి చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.