'పంటల వైవిధ్యంతోనే అధిక లాభాలు'

'పంటల వైవిధ్యంతోనే అధిక లాభాలు'

JGL: పెగడపల్లిలోని రైతు వేదికలో ఏటీఎం పథకంలో భాగంగా శుక్రవారం రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఏవో శ్రీకాంత్ మాట్లాడుతూ.. సాగులో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించి, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రైతులు ఆధునిక పద్ధతులను అనుసరించాలన్నారు. పంటల మార్పిడి చేయడం వల్ల ఆదాయం పెరగడమే కాకుండా, సాగులో ప్రమాదాలు తగ్గుతాయన్నారు.