నిరుద్యోగ యువతకు సువర్ణ అవకాశం: ఎమ్మెల్యే
ASF: నిరుద్యోగ యువతీ యువకులకు సువర్ణ అవకాశం లభించిందని ఎమ్మెల్యే హరీశ్ బాబు అన్నారు. ఈరోజు కాగజ్ నగర్ పట్టణంలో స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏర్పాటైన ఈ శిక్షణ కేంద్రంలో గ్రామీణ, పట్టణ నిరుద్యోగులకు ఉచితంగా వసతి, భోజన సౌకర్యంతోపాటు నైపుణ్య శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.