ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణమే ధ్యేయం

HNK: ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణమే ధ్యేయం అని వైద్యాధికారి డాక్టర్ ప్రదీప్ రెడ్డి అన్నారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ సహకార గ్రామీణ పరపతి, మార్కెటింగ్ సొసైటీ ఆవరణలో ఉద్యోగులకు ముల్కనూర్ పిహెచ్‌సీ వైద్యాధికారి ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇతర సిబ్బంది పాల్గొన్నారు.