విషాదం.. పిడుగుపాటుతో 4ఆవులు మృతి
అన్నమయ్య: ఉగాది పండుగ పూట కలకడ మండలంలో విషాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి పిడుగు పడటంతో నవాబుపేట గ్రామానికి చెందిన రైతు అప్పయ్య చౌదరికి చెందిన 4 ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. జీవనాధారమైన పశువులు కోల్పోవడంతో కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. సుమారు లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని బాధితులు కోరుతున్నారు.