ఆ పనికి కేతిరెడ్డిని చెప్పుతో కొట్టాలి: తోపుదుర్తి
అనంతరపురంలో వైసీపీ విభేదాలు బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తన ప్రత్యర్థులతో కేతిరెడ్డి చేతులు కలిపారన్నారు. వైసీపీ సస్పెండ్ చేసిన నేతలను చేరదీశారని అందుకు కేతిరెడ్డిని చెప్పు తిరగేసి కొట్టాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ సస్పెండ్ చేసిన వాళ్లను వెంటేసుకుని తిరగడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.