కోదాడలో సైబర్ కేటుగాళ్ల గుట్టురట్టు.. 30 మంది అరెస్ట్

కోదాడలో సైబర్ కేటుగాళ్ల గుట్టురట్టు.. 30 మంది అరెస్ట్

SRPT: ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో అమాయకులను ముంచుతున్న భారీ సైబర్ ముఠాను పోలీసులు ఛేదించారు. కోదాడ నియోజకవర్గ పరిధిలోని చిలుకూరు, ఆకుపాముల తదితర గ్రామాల్లో దాడులు నిర్వహించి 30 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో అధికార పార్టీ నేతలు కూడా ఉన్నట్లు సమాచారం. నిందితుల బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసి, నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.