హోంగార్డుకు ‘చేయూత’

హోంగార్డుకు ‘చేయూత’

SKLM: ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డు బి.సూర్య నారాయణకు 'చేయూత' ను అందించేందుకు హెూంగార్డు సిబ్బంది స్వచ్ఛందంగా విరాళం ఇచ్చిన ఒక్క రోజు డ్యూటీ అలవెన్సు నగదు చెక్కు రూ.4.08 లక్షలను ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి తన కార్యాలయంలో అందజేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ఉద్యోగ విరమణ అనంతరం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఎస్పీ ఆకాంక్షించారు.