'భారత్ ఏక్తా యాత్రను విజయవంతం చేద్దాం'
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రేపు నిర్వహించబోయే భారత్ ఏక్తా యాత్రను విజయవంతం చేద్దామని బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానం నుంచి ఉదయం 9 గంటలకు ర్యాలీ ప్రారంభమై బాలుర కళాశాల మైదానంలో ముగుస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆయన కోరారు.