ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే
KDP: ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే సుధాకర్ తెలిపారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన అర్జీల స్వీకరణ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వయంగా స్వీకరించి పరిశీలించారు. వివిధ వ్యక్తిగత, సామాజిక, అభివృద్ధి సమస్యలపై వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు వెంటనే పంపించి, త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.