ప్రజల సురక్షిత ప్రయాణం కోసం పనిచేస్తున్న పోలీసులు
MBNR: ప్రజల సురక్షిత ప్రయాణం కోసం జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కట్టుబడి పనిచేస్తుందని మహబూబ్ నగర్ ఎస్పీ జానకి వెల్లడించారు. నవాబుపేట మండలం రుద్రారంలో రోడ్డు భద్రతపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. ప్రతి ప్రమాదం ఒక కుటుంబానికి తిరిగి రాని నష్టం కలిగిస్తుందన్నారు. గ్రామస్థాయిలో డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి లైసెన్స్‌లు ఇప్పిస్తామని తెలిపారు.