తిరుపతిలో సైబర్ మోసం

తిరుపతిలో సైబర్ మోసం

TPT: తిరుపతిలోని మాధవ్ నగర్‌కు చెందిన బాధితుడికి(47) ఫేస్బుక్ ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. 'ఎస్కార్ట్ సర్వీస్, ప్లేబాయ్' పేరుతో ఉద్యోగాలు ఉన్నాయని నమ్మించాడు. రిజిస్ట్రేషన్ పేరిట కొంత డబ్బులు, ఫొటోలు, సంతకం తీసుకొని ఈ క్రమంలో ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. తద్వారా 150 సార్లు ఆన్లైన్‌లో రూ.17.99 లక్షలు వసూళ్లు చేశాడు.