బీజెపీ బూత్ కమిటీ అధ్యక్షుల నియామకం
NGKL: అమ్రాబాద్ మండలం కుమ్మరోని పల్లి గ్రామంలో ఆదివారం బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజెపీ మండల అధ్యక్షురాలు జానకి హాజరై బూత్ కమిటీ అధ్యక్షులను నియమించారు. 305 బూత్ కమిటీ అధ్యక్షులుగా మల్లేష్, 306 బూత్ కమిటీ అధ్యక్షులుగా శివ యాదవ్‌ను ఏకగ్రీవంగా ఎనుకున్నారు. మండలంలో బీజెపీ బలోపేతానికి కృషి చేయాలని ఆమె సూచించారు.