సుంకేసుల జలాశయానికి భారీ వరద ప్రవాహం

సుంకేసుల జలాశయానికి భారీ వరద ప్రవాహం

E.G: కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర నది ప్రవాహం గంట గంటకు పెరుగుతోంది. రాజోలిలోని సుంకేసుల జలాశయంకు తుంగభద్ర వరద ప్రవాహం పోటెత్తింది. హోస్పేట్ డ్యాం నుంచి లక్ష క్యూసెక్కులకు పైగా వరద నీరు చేరుతుండడంతో అప్రమత్తమైన అధికారులు ముందస్తుగా 70 వేల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేశామని తెలిపారు.