ధర్మవరంలో స్వీట్ షాప్‌లో అగ్ని ప్రమాదం

అనంతపురం: ధర్మవరం పట్టణం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న స్వీట్ షాప్‌లో బుధవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు షాపు యజమాని బాబ్జాన్ తెలిపారు. ఈ ప్రమాదంలో షాప్‌లో ఉన్న తినుబండరాలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని బాధితుడు వాపోయారు.