అంగన్వాడీల అక్రమ అరెస్ట్‌లు ఆపాలని నిరసన
ATP: అంగన్వాడీల అక్రమ అరెస్ట్‌లను వ్యతిరేకిస్తూ గుత్తి ఎన్టీఆర్ సర్కిల్లో అంగన్వాడీ టీచర్లు మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. అంగన్వాడీ టీచర్ కళ్యాణి మాట్లాడుతూ.. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో జరుగు మహా ధర్నాకు వెళ్తున్న వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం ఆపాలని డిమాండ్ చేశారు. ఇలా అక్రమ అరెస్ట్‌లతో ఉద్యమాలు ఆపలేరన్నారు.