VIDEO: రూపాయికే టీ షర్ట్.. చివరికి ఏమి జరిగిందంటే?

NLR: నగరంలోని నిప్పో సెంటర్ వద్ద ఉన్న ఓ నూతన బట్టల దుకాణం వారు రూపాయికే టీ షర్ట్, రెండు రూపాయలకు ప్యాంట్ అంటూ అసత్య ప్రచారం చేశారు. పండగ పూట జనం రోడ్లపై పడిగాపులు కాయవలిసిన పరిస్థితి ఏర్పడింది. తక్కువ డబ్బులకు పండగ పూట ఆఫర్ ఇస్తున్నారని కొందరు ప్రచారం చేయడంతో షాపు దగ్గర జనాలు గుమిగూడారు. జనాలు ఎక్కువగా రావడంతో ట్రాఫిక్ నిబంధనల వల్ల ఓనర్ షాపును క్లోజ్ చేశారు.