'సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయి'

ATP: కూటమి ప్రభుత్వం అందిస్తున్న సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాల్వ కొనియాడారు. రాయదుర్గం పట్టణంలోని సీతారామాంజనేయ కళ్యాణమండపంలో శ్రీ శక్తి యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ విప్ కాల్వ ముఖ్యఅతిథిగా పాల్గొని సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి హామీ నెరవేరుస్తున్నామన్నారు.