ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థుల భవిష్యత్తు

SKLM: నాణ్యమైన శాస్త్రీయ విద్య కోసం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను జాయిన్ చేయాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ అన్నారు. శనివారం ఉదయం లావేరు మండలంలోని అదపాకలోని పలు గ్రామాల్లో ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థుల ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు పాఠశాలల్లో అందిస్తారన్నారు.