పేద ప్రజలకు గూడు కల్పించడం ప్రభుత్వ లక్ష్యం
RR: చేవెళ్ల మున్సిపాలిటీ 3వ వార్డులో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. పేద ప్రజలకు గూడు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి అర్హులైన కుటుంబానికి ఇల్లు కల్పించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ సమత వెంకట్ రెడ్డి, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.