రేపు ఉచిత కంటి వైద్య శిబిరం
NGKL: పట్టణంలోని సత్యసాయి మందిరంలో ఈ నెల 3న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు కన్వినర్ హకీమ్ ప్రసాద్ తెలిపారు. ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తామన్నారు. ఆపరేషన్లు అవసరమైన వారిని గుర్తించి ప్రత్యేక అంబులెన్స్‌లో HYDకి తరలించి కంటి శస్త్ర చికిత్సలు ఉచితంగా చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.