మానవ రూపంలో వినాయకుడు.. ఎక్కడంటే?

హిందూ సంప్రదాయంలో ప్రతి శుభకార్యానికి ముందు విజ్ఞాలు తొలగిపోవాలని వినాయకుడిని పూజిస్తారు. అయితే ఏనుగు తొండంతో ఉన్న గణేశుడి ఆకారం మాత్రమే మనకు తెలుసు. మానవ రూపంలో వినాయకుడు వెలిసిన క్షేత్రం తమిళనాడులో ఉంది. తిరువూరు జిల్లాలోని తలతర్పణపురిలో ఉన్న శ్రీ ముక్తేశ్వర్ ఆలయ ప్రాంగణంలో మానవ రూపంలో గణపతి కొలువుదీరాడు. ఈ ఆలయాన్ని నరముఖ గణపతి ఆలయం, వినాయకర్ ఆలయం అని పిలుస్తారు.