'వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి'

KMR: బిచ్కుందలోని పోలీస్ స్టేషన్‌లో శనివారం గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో ఎస్సై మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. గణేష్ ఉత్సవాల సమయంలో మండపాల వద్ద నిమజ్జనం రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. శాంతియుతంగా పండుగ జరుపుకోవాలని సూచించారు.