కంభంలో 'స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్' కార్యక్రమం

కంభంలో 'స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్' కార్యక్రమం

ప్రకాశం: కంభం పట్టణంలోని నెహ్రూనగర్‌లో శనివారం ఉదయం 'స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్' కార్యక్రమంలో భాగంగా సీఐ మల్లికార్జున పారిశుద్ధ్య కార్మికులతో బ్లీచింగ్ చల్లించారు. ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చెత్తాచెదారం ఎక్కడపడితే అక్కడ రోడ్లపై వెయ్యరాదన్నారు.