సెంచరీతో అదరగొట్టిన ధ్రువ్ జురెల్
సౌతాఫ్రికా-'A'తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్-'A' బ్యాటర్ ధ్రువ్ జురెల్ అద్భుత ప్రదర్శన చేశాడు. 145 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మిగతా బ్యాటర్లు అంతా తడబడుతున్నప్పటికీ, జురెల్ మాత్రం ఒంటరి పోరాటం చేస్తున్నాడు. రిషభ్ పంత్(24), రాహుల్(19) నిరాశపరిచారు. ప్రస్తుతం భారత్ స్కోర్: 221/8.