సీసీటీవీ ఫుటేజ్‌లో మాచర్ల అత్యాచార ఘటన అనుమానితుడు
PLD: మాచర్ల అత్యాచార ఘటనకు సంబంధించి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లను శుక్రవారం పరిశీలించి ఓ వ్యక్తిని అనుమానితుడిగా భావిస్తున్నారు. సంబంధిత వ్యక్తి గురించి విచారణ చేయడంతో సీసీ ఫుటేజ్‌ల ద్వారా సేకరించిన వీడియోలోని ఫోటోలను తయారు చేస్తున్నారు. నిందితులను త్వరగా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సమీప ప్రాంతాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు.