ఓటరు జాబితా-2025 ప్రత్యేక సవరణ తుది గడువు నవంబర్ 28

MBNR: ఓటరు జాబితా 2025 సవరణ తుది గడువు ఈనెల28తో ముగుస్తుందని, అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తాసిల్దార్ పాండు నాయక్ అన్నారు. శనివారం లింగాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఓటర్ జాబితా 2025 భాగంగా ప్రత్యేక కంపెయిన్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఫారం- 6 ద్వారా కొత్త ఓటర్ల ను నమోదు చేయాలన్నారు.