'సీఎంఆర్ఎఫ్ ఒక వరం లాంటిది'

'సీఎంఆర్ఎఫ్ ఒక వరం లాంటిది'

HNK: కయ సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు ఒక వరం లాంటిదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ధర్మసాగర్ మండలం సాయిపేట గ్రామానికి చెందిన పలువురు కొన్ని నెలల క్రితం వివిధ అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఆర్థిక భారంతో ఇబ్బందులు పడుతుండగా ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది. ఎమ్మెల్యే కడియం వారికి సీఎంఆర్ఎఫ్ మంజూరు చేయించి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.