VIDEO: నూజివీడులో భారీ వర్షం

ELR: నూజివీడు పట్టణంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వేసవిని తలపించే ఎండ రాగా, మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. రాత్రి అనుకోని రీతిలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇలాంటి పెద్ద వర్షాలు మరిన్ని కురవాలని రైతులు కోరుతున్నారు. వానలు లేక నూజివీడులో వ్యవసాయ పనులు కొనసాగడం లేదన్నారు.