ముగిసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పోరాటం

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పోరాటం ముగిసింది. నిన్న DCతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. SRH 11 మ్యాచ్‌లలో కేవలం 7 పాయింట్లతో టోర్నీలో చివరి నుంచి 3వ స్థానంలో ఉంది. మిగిలిన మ్యాచ్‌లు గెలిచినా ప్లేఆఫ్స్‌కు చేరుకోలేదు. ఈ సీజన్‌లో SRH ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.