గుంతలమయంగా ప్రధాన రోడ్డు.. వాహనదారుల అవస్థలు!
VKB: నవాబుపేట మండల కేంద్రంలో ప్రధాన రోడ్డు అద్వానంగా మారి ప్రయాణికులకు నరకం చూపిస్తోంది. రహదారిపై భారీ గుంతలు పడటంతో వివిధ పనుల నిమిత్తం వచ్చే వాహనదారులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.