ఘనంగా తీజ్ వేడుకలు

SRCL: ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లోని గిరిజన తండాల్లో బంజారులు తీజ్ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా బంజారులు బుట్టలో గోధుమలు వేసి వారం రోజుల తర్వాత వచ్చిన మొలకలను నీటిలోకి వదులుతారు. డప్పుచప్పుళ్ల మధ్య బంజారుల విన్యాసాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో గిరిజన తండా నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.