ప్రేమ సమాజంలో లక్కీ డ్రా కాంటెస్ట్
విశాఖ డాబాగార్డెన్ ప్రేమ సమాజంలో లక్కీ డ్రా కాంటెస్ట్-2026ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, స్థానిక కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.