ఫుడ్ పార్క్ పండించే పంటలు పరిశ్రమకు ఉపయోగం: కలెక్టర్

KMM: బుగ్గపాడు ఫుడ్ పార్క్ పరిధిలో లక్ష ఎకరాల వరకు భూమి ఉందని, ఇక్కడ పండించే పంటలు ఆహార శుద్ధి పరిశ్రమకు ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంత్రి తుమ్మల మార్గదర్శకంలో జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో 9 వేల ఎకరాలలో ప్రస్తుతం పండ్లు, కూరగాయల పంట పెరిగే దిశగా పని చేస్తున్నామని పేర్కొన్నారు.