ఆటో బోల్తా.. 12 మందికి గాయాలు

ATP: విడపనకల్లు మండలం కొట్టాలపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరకముక్కల గ్రామం నుంచి కొట్టాలపల్లికి వెళ్తుండగా ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది మిరప కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం 8 మంది క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.