VIDEO: బీజేపీ నాయకుల అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత
MDK: జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. ఈ సమ్మెకు సంఘీభావం తెలిపిన బీజేపీ నాయకులు, కార్మికులతో కలిసి గుల్షన్ క్లబ్ నుంచి డిపో వరకు ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు వీరిని అడ్డుకుని క్లబ్ గేట్లు మూసివేశారు. ఈ క్రమంలో పలువురు కార్మికులను అరెస్ట్ చేసి పాపన్నపేట పోలీస్ స్టేషన్‌కు తరలించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.