సీఎంకు థ్యాంక్స్ చెప్పిన ఎమ్మెల్యే నాయిని
వరంగల్‌కు నిధులు కేటాయించిన సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి ధన్యావాదాలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. "గతంలో జిల్లాను బీఆర్ఎస్ నాశనం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నగరంలో కబ్జాలు లేవు. ఎయిర్‌పోర్ట్ భూసేకరణకు రూ.300 కోట్లు కేటాయించారు. భూసేకరణ పూర్తికాగానే ఎయిర్ పోర్ట్ పనులు ప్రారంభిస్తాం" అని అన్నారు.