విజయవాడలో జోరుగా బెల్ట్ షాపులు ఏర్పాటు
NTR: విజయవాడ శివారు గ్రామాలలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఏర్పడుతున్నాయని ప్రజల ఆరోపిస్తున్నారు. రామవరప్పాడు ఎనికెపాడు, హరిజనవాడ ప్రసాదంపాడు నిడమానూరు గూడవల్లి గ్రామాలలో జాతీయ రహదారి ప్రక్కన సైతం బెల్ట్ షాపులు జోరుగా ఏర్పడుతున్నాయి. ఆయా షాపుల పక్కనున్న కుటుంబాలకు ఇబ్బందులు కలిగేలా మందుబాబులు వివాదాలతో వ్యవహరిస్తున్నారు.