VIDEO: మేడారం ఆలయంలో భక్తుల రద్దీ

MLG: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించేందుకు ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తులు జంపన్న వాగులో పుణ్య స్థానాలు ఆచరించి, తల్లుల గద్దెల వద్దకు చేరుకొని పసుపు, కుంకుమ, చీర సారే, బంగారం (బెల్లం) సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తుల సందడితో కళకళలాడాయి.