నష్టపోయిన బాధితులకు సహాయం చేసిన ఎంపీ

సత్యసాయి: ఏడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ధర్మవరం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ, సత్యసాయి నగర్‌లో ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఈ విషయం తెలుసుకున్న హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి శుక్రవారం రాత్రి వారి ఇళ్ళవద్దకు వెళ్లి స్వయంగా పరిశీలించారు. తాత్కాలిక సాయంగా ఒక్కొక్క కుటుంబానికి 10 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేశారు.