ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
WGL: శివనగర్‌లో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ పార్టీ జెండా ఆవిష్కరించి మాట్లాడుతూ.. బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అని, బీజేపీ పార్టీ రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని, బీజేపీ పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలన్నారు.