అర్జీలు స్వీకరించిన మంత్రి బీసీ

అర్జీలు స్వీకరించిన మంత్రి బీసీ

నంద్యాల: బనగానపల్లెలోని మంత్రి కార్యాలయంలో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి అర్జీలను ఆదివారం స్వీకరించారు. రెవెన్యూ, పెన్షన్లు, ఉద్యోగాలు, ఉపాధి తదితర అంశాలపై ప్రజలు తమ వినతులు సమర్పించారు. సమస్యలను శ్రద్ధగా విన్న మంత్రి న్యాయబద్ధమైన అర్జీలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కారించారు.