VIDEO: పిల్లలను చదివించాలి: ఎమ్మెల్యే
WGL: ఎల్బీ స్టేడియంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రతి విద్యార్థి చదువుకొని విజ్ఞానవంతులు కావాలని, ఇంట్లో తల్లి చదువుకున్నవారైతే ఆ కుటుంబం బాగుపడుతుందని, తద్వారా సమాజం బాగుపడుతుందని అన్నారు. పిల్లలను చదివించాలని తల్లిదండ్రులకు ఎమ్మెల్యే సూచనలు చేశారు.