ఈనెల 16న మంత్రి నివాసంలో అయ్యప్ప పడి పూజ

ఈనెల 16న మంత్రి నివాసంలో అయ్యప్ప పడి పూజ

SS: పెనుకొండ మండలంలోని మంత్రి సవిత నివాసంలో ఈ నెల 16వ తేదీన అయ్యప్పస్వాముల పడిపూజ ఘనంగా జరుగనుంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు మంత్రి సవిత నివాసంలో అయ్యప్పస్వాముల పడిపూజ ఉంటుందని టీడీపీ పట్టణ కన్వీనర్ శ్రీరాములు ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అయ్యప్పస్వాములు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.