రూ.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

మేడ్చల్: దశలవారీగా అన్ని కాలనీలు, బస్తీలో సీసీ రోడ్డు పనులను పూర్తి చేస్తామని మల్కాజ్‌గిరి కార్పొరేటర్ శ్రవణ్ అన్నారు. సీతారాంనగర్‌లో దాదాపు రూ.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బలరాం నగర్‌లో వేసిన నూతన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలించారు.