'కాలువలు, రోడ్లపై ఆక్రమణలు తొలగించండి'

'కాలువలు, రోడ్లపై ఆక్రమణలు తొలగించండి'

తిరుపతి నగరంలో డ్రైనేజీ కాలువలు, రోడ్లపై నిర్మించిన అక్రమ నిర్మాణాలు, ర్యాంపులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కమిషనర్ ఎన్.మౌర్య అన్నారు. మంగళవారం ఆమె లక్ష్మీపురం, జయనగర్, మున్సిపల్ ప్రైమరీ స్కూల్ ప్రాంతాలను పరిశీలించారు. వెంటనే ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. కాలువల్లో చెత్త నిల్వ లేకుండా నిరంతరం శుభ్రం చేయాలని సిబ్బందికి సూచించారు.