గ్రామాల అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలి: ఆడే గజేందర్
ADB: గ్రామాల అభివృద్ధికి గ్రామస్తులందరూ కలిసికట్టుగా పనిచేయాలని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. శనివారం నేరడగోండ మండలంలోని గోవిందపూర్ గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఆయన పర్యటించారు. ప్రజలతో సమావేశమై వారి సమస్యలను విని పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.