ఎంపీడీవో ఆఫీస్‌లో ఫెసిలిటేషన్ సెంటర్లు: కలెక్టర్
VKB: జిల్లాలోని ఎంపీడీవో కార్యాలయాల్లో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా ఈ కేంద్రాలు ఈ రోజు, రేపు అందుబాటులో ఉంటాయని, పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఎంపీడీవోలు కేంద్రాలను పర్యవేక్షించాలన్నారు.